ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన లేడీ డైరెక్టర్


Nandini Reddy

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై సెన్సేషనల్ కెమెంట్స్ చేసి సంచలనం సృష్టించింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి . ఇంతకీ ఈ లేడీ డైరెక్టర్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా …….. క్రష్ అని . అవును ప్రభాస్ అంటే నందిని రెడ్డి కి చాలా క్రష్ అట ! ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పడమే కాకుండా అతడి దగ్గర ఈ విషయం చెప్పాలని అనిపిస్తుంది కానీ ప్రభాస్ కనబడగానే సిగ్గుల మొగ్గ అవుతానని అందుకే ఇప్పటివరకు చెప్పలేకపోయానని అంటోంది నందిని రెడ్డి .

ప్రభాస్ అంటే ఒక్క నందిని రెడ్డి కి మాత్రమే కాదు ఇంకా చాలామందికి ఇష్టం . సినిమారంగంలోని పలువురు హీరోయిన్ లు కూడా ప్రభాస్ అంటే పడిచస్తున్నారు . కానీ ప్రభాస్ మాత్రం సింపుల్ గా నవ్వుతు వెళ్ళిపోతున్నాడు కానీ పెళ్లి చేసుకోవడం లేదు అలాగే తనని ప్రేమిస్తున్న వాళ్ళని పట్టించుకోవడం లేదు . అయితే ఈ రకంగానైనా నందిని రెడ్డి ప్రేమ ప్రభాస్ కు తెలుస్తుందేమో చూడాలి .