అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా


director parashuram hopes on allu arjun దర్శకులు పరశురామ్ అల్లు అర్జున్ పై ఆశలు పెట్టుకున్నాడు . తన దగ్గర ఉన్న కథలను అల్లు అర్జున్ కు వినిపించాడట ! బాగున్నాయని కూడా చెప్పాడట అయితే అందులో ఏది తనకు నచ్చుతుందో మాత్రం చెప్పలేదట అందుకే అల్లు అర్జున్ కు ఏది నచ్చితే ఆ కథతో సినిమా చేస్తానని అంటున్నాడు పరశురామ్ . గీతా ఆర్ట్స్ లో ఇంతకుముందు శ్రీరస్తు శుభమస్తు వంటి హిట్ చిత్రాన్ని అందించాడు ఇక ఇప్పుడేమో విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఈనెల 15 న ఆ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో గీత గోవిందం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు పరశురామ్ .

ఇక ఇప్పటికే రెండు సినిమాలకు గీతా ఆర్ట్స్ లోనే దర్శకత్వం వహించిన పరశురామ్ కు అల్లు అరవింద్ మరో ఆఫర్ ఇచ్చాడు . మరో సినిమా చేయమని చెప్పాడట దాంతో అది అల్లు అర్జున్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడు పరశురామ్ . తన దగ్గర ఉన్న కథలను చెప్పిన పరశురామ్ అల్లు అర్జున్ కు ఏది నచ్చుతుందో ? లేక కొత్త కథ రాయాలా అని ఆలోచన చేస్తున్నాడట . మరి అల్లు అర్జున్ ఈ దర్శకుడి కి అంతతొందరగా ఛాన్స్ ఇస్తాడా ? చూడాలి .

English Title: director parashuram hopes on allu arjun