ఇప్ప‌టికి నా క‌ల నెర‌వేరుతోంది – ప‌ర‌శురామ్‌

ఇప్ప‌టికి నా క‌ల నెర‌వేరుతోంది - ప‌ర‌శురామ్‌
ఇప్ప‌టికి నా క‌ల నెర‌వేరుతోంది – ప‌ర‌శురామ్‌

మ‌హేష్  క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌రువాత మ‌హేష్‌బాబు ఎవ‌రితో త‌న త‌దుప‌స‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌హేష్ 28వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి రూపొందిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

ఇదే విష‌యాన్ని `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా రిలీజ్ స‌మ‌యంలో మ‌హేష్ వెల్ల‌డించారు కూడా. అయినా ఆ స్థానంలో అనూహ్యంగా ప‌ర‌శురామ్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. అత‌నే నెక్ట్స్ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని స్ప‌ష్ట‌త వ‌చ్చింది.  ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ వెల్ల‌డించారు. అయితే ఈ రోజు కోసం త‌ను ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఒక్క‌డు` సినిమా నేను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌వైపు అడుగులు వేసేలా చేసింది. మ‌హేష్‌బాబు స‌ర్‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నాను. ఇప్ప‌టికి నా క‌ల నెర‌వేరుతోంది. ఓ అద్భుత‌మైన క‌థ‌తో మీ ముందుకు రానున్నాం. ఈ సినిమా త‌ప్ప‌కుండా గుర్తుండిపోయే చిత్ర‌మ‌వుతుంది. ఎలివేష‌న్ సీన్స్ రాయ‌లేక‌కాదు..అవ‌స‌రం రాలేదు. కానీ ఇప్పుడు నాలోని ఆ యాంగిల్‌ని కూడా చూస్తారు` అని తెలిపారు.