అనగనగా ఓ ప్రేమకథ లోని ఒక తొలిప్రేమ పాట ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు పరశురామ్


Parasuram launched Oka toliprema song from 'Anaganaga o prema kadha'

ఈ చిత్రానికి సంబంధించిన ‘ఒక తొలిప్రేమ ‘ సాంగ్ ను ప్రముఖ దర్శకుడుపరశురామ్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయన్నారు. హీరో అశ్విన్ బాగా చదువుకున్నవాడు. వినయ విధేయతలు కలిగినవాడు. చిత్రం టీజర్ ను చూసాను. ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు.

తమ చిత్రంలోని పాటను దర్శకుడు పరశురామ్ విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ గీతం అరకు, విశాఖపట్నం లలోని పలు లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ పేరుతొ ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ

నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి