తెలంగాణ యాసలో రాసే రైటర్ కావాలట


director prasanth varma looking for dialogue writerతెలంగాణ యాసలో డైలాగ్స్ రాసే రైటర్ కావాలంటూ యువ దర్శకులు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేయడంతో అతడి కొత్త సినిమా తెలంగాణ నేపథ్యంలో రూపొందబోతోందన్న హింట్ ఇచ్చాడు . ” అ ” చిత్రంతో విభిన్న కథా చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ కాగా ఆ సినిమా తర్వాత హీరో డాక్టర్ రాజశేఖర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఇక హీరో డాక్టర్ రాజశేఖర్ కూడా తన తదుపరి సినిమా ప్రశాంత్ వర్మ తో అని చెప్పాడు కూడా . అయితే ఈ సినిమా నేపథ్యం 1983 నాటి కాలం దట ! అంటే అప్పుడు దొరల పెత్తనం , అలాగే నక్సలిజం బాగా ఉన్న రోజులు మరి .

దొరలు , నక్సలిజం నేపథ్యంలో సినిమా అంటే సుర్రు సుమ్మయిపోవడం ఖాయం , అయితే అది 1983 నేపథ్యం అని అన్నాడు కానీ స్టోరీ లైన్ రివీల్ చేయలేదు కాబట్టి ఊహించుకోవడం తప్ప చేసేదేమి లేదు . ఇక ఈ సినిమా విషయానికి వస్తే ……. తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసే వాళ్లు కావాలని ట్వీట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ . తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసే వాళ్లకు ఇది మంచి అదృష్టమే మరి . తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేవాళ్ళు వెంటనే ప్రశాంత్ ని సంప్రదించండి అదృష్టాన్ని పరీక్షించుకోండి .

English Title: director prasanth varma looking for dialogue writer