సినిమా ప్లాప్ అని ప్రచారం చేసుకుంటున్నారు


 Director prashanth kumar open letter

మా సినిమా ప్లాప్ అయ్యిందని హీరో అంటే అవును ప్లాప్ అయ్యిందని దర్శకుడు కూడా జత కలిసాడు . అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన ఈరోజు జరిగింది . ఇంతకీ మా సినిమా ప్లాప్ అంటే మా సినిమా ప్లాప్ అని ప్రచారం చేసుకుంటున్న సినిమా మిఠాయి . రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రశాంత్ దర్శకత్వం వహించాడు .

 

అయితే ఫిబ్రవరి 22న రిలీజ్ అయిన ఈ సినిమా ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో మా సినిమాకు ఎన్నో రిపేర్లు చేయాలనీ చూసాను కానీ ప్లాప్ అయ్యింది అని రాహుల్ రామకృష్ణ పేర్కొనగా దర్శకుడు ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మా సినిమా ప్లాప్ అయ్యింది అని ఒప్పుకున్నాడు అంతేకాదు మా సినిమా పరాజయానికి కారణం నేనే ! హిట్ అయితే నేను కారణం అంటూ చాలామంది వస్తారు కానీ ప్లాప్ అయితే మాత్రం ఒక్క దర్శకుడిని మాత్రమే బాధుడ్ని చేస్తారు . అయితే నా సినిమాకు మాత్రం మరికొంతమంది సాంకేతిక నిపుణులు కూడా బాద్యత వహిస్తున్నారు అంటూ పేర్కొన్నాడు దర్శకుడు ప్రశాంత్ కుమార్ .

English Title :  Director prashanth kumar open letter