స్టార్ డైరెక్ట‌ర్ వంద కోట్లు పోగొట్టుకున్నారా?


స్టార్ డైరెక్ట‌ర్ వంద కోట్లు పోగొట్టుకున్నారా?
స్టార్ డైరెక్ట‌ర్ వంద కోట్లు పోగొట్టుకున్నారా?

స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ వంద కోట్లు పోగొట్టుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం ల‌భిస్తోంది. స్వ‌యంగా ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రం `బద్రి`తో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌య్యారు. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడిగా వెనుదిరిగి చూసుకోని పూరి ఆ త‌రువాత వ‌రుస హిట్‌ల‌ని అందించాడు.

`పోకిరి` లాంటి ఇండ‌స్ట్రీ హిట్‌ల‌ని అందించాడు. కోట్లు సంపాదించాడు. వంద కోట్ల ఆస్తిని ద‌ర్శ‌‌కుడిగా అన‌తి కాలంలోనే సంపాదించాడ‌ట‌. అయితే ఆ మొత్తాన్ని పోగొట్టుకున్నాడ‌ట‌. కొంత మంది స్నేహితుల్ని న‌మ్మి కూడ‌బెట్టిన మొత్తాన్ని పోగొట్టుకున్నానిన‌, దాంతో రోడ్డున ప‌డ్డాన‌ని ఊరి జ‌గ‌న్నాథ్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు కానీ ఎంత పోగొట్టుకుంది మాత్రం వెల్ల‌డించ‌లేదు.

తాజాగా వంద కోట్లు పోగొట్టుకున్నాన‌ని, త‌న‌లా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్‌శ‌కుడు సంపాదించ‌లేదేమోన‌ని, అయితే ఆ మొత్తాన్ని కొంత మంది న‌మ్మించి మోసం చేయ‌డం వ‌ల్ల పోగొట్టుకున్నానని వెల్ల‌డించాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.