హీరోగా మారుతున్న స్టార్ డైరెక్ట‌ర్‌!


హీరోగా మారుతున్న స్టార్ డైరెక్ట‌ర్‌!
హీరోగా మారుతున్న స్టార్ డైరెక్ట‌ర్‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు హీరోగా మారుతున్నారు. య‌స్ మీరు చ‌దివింది నిజ‌మే. 70వ ద‌శ‌కంలో శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన `బాబు` చిత్రంతో రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. అప్ప‌టి నుంచి `ఇంటింటా అన్న‌మ‌య్య‌` వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల్లో చిన్న పాత్ర‌ల్లోనూ క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. మీడియాకు సైతం ఇంట‌ర్యూలు ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపించ‌ని ఆయ‌న తాజాగా కొత్త దారి పట్టారు.

ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 78 ఏళ్లు. ఈ వ‌య‌సులో ఆయ‌న హీరోగా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. ఆయ‌న‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్‌లు న‌టించ‌బోతున్నారు. పాపుల‌ర్ ఫిమేల్ యాక్ట్రెస్ ల‌ని రాఘ‌వేంద్ర‌రావు కోసం చిత్ర బృందం ఫైన‌లైజ్ చేసింది. ద‌ర్శ‌కుడిగా 45 ఏళ్ల సుధీర్గ ప్ర‌స్థానంలో రాఘ‌వేంద్ర‌రావు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీలోనూ క‌నిపించ‌లేదు.

డి. రామానాయుడు త‌ర‌హాలో అతిధి పాత్ర‌ల్లోనూ మెరిసేందుకు ఆస‌క్తిని చూపించ‌లేదు. కానీ తాజాగా ఓ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఆయ‌న క్లీన్ బౌల్డ్ అయ్యార‌ట‌. కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఎవ‌రు నిర్మించ‌నున్నారు? వ‌ంటి వివ‌రాల్ని త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.