విజేత కథ కళ్యాణ్ కోసం రాయలేదట


director rakesh shashi about chiranjeevi son in law kalyan dhevచిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కోసం విజేత కథ రాయలేదని , ఈ కథ మూడేళ్ళ క్రితమే రాసుకున్నానని అయితే సాయి కొర్రపాటి గారు మిగతా సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల మూడేళ్లు ఆలస్యం అయ్యిందని అంటున్నాడు విజేత చిత్ర దర్శకుడు రాకేష్ శశి . జతకలిసే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాకేష్ శశి తన రెండో చిత్రన్ని చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తో చేసాడు . ఇక ఈ సినిమా ఈనెల 12న విడుదల అవుతున్న నేపథ్యంలో విజేత విశేషాలను వెల్లడించాడు దర్శకుడు రాకేష్ శశి .

చిరంజీవి గారి విజేత కు నా సినిమా విజేత కు ఏమాత్రం పోలికలు లేవని అయితే ఒక్క టైటిల్ తప్ప ఎక్కడా ఆ సినిమా తాలూకు ప్రభావం ఉండదని , 90 శాతం మంది జనాల స్థితిగతులు ఇందులో ఉన్నాయని సామాన్య మైన వ్యక్తి అసామాన్య స్థాయి ని ఎలా అందుకున్నాడో తెలియజెప్పే కథ అందుకే విజేత టైటిల్ ని పెట్టుకున్నామని అంటున్నాడు రాకేష్ శశి .

కళ్యాణ్ దేవ్ చక్కగా నటించాడని , కొత్త కుర్రాడు అని ఎక్కడా అనిపించలేదని …… తాను మధ్యతరగతి వ్యక్తి కాకపోయినప్పటికీ ప్రజల జీవన విధానం ఎలా ఉందో చాలావరకు తెలుసుకొని మరీ నటించాడని కితాబు నిస్తున్నాడు విజేత దర్శకుడు రాకేష్ శశి .

English Title : director rakesh shashi about chiranjeevi son in law kalyan dhev