అర్జున్ రెడ్డి డైరెక్టర్ తల్లి మృతి


Sandeep Reddy Vanga Mother Passed away
Sandeep Reddy Vanga Mother Passed away

తెలుగునాట అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకులు సందీప్ రెడ్డి వంగా తల్లి వంగా సుజాత మృతి చెందారు . ఈరోజు తెల్లవారుఝామున వరంగల్ లోని స్వగృహంలో ఆమె మరణించారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు . తల్లి మరణంతో సందీప్ రెడ్డి వంగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది .

తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగా అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు . కాగా హిందీలో ప్రభంజనం సృష్టించిన కబీర్ సింగ్ ఏకంగా 300 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . కబీర్ సింగ్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో చాలా సంతోషంగా ఉన్న సమయంలో తల్లి మరణవార్తతో శోకసంద్రంలో మునిగింది సందీప్ కుటుంబం . సందీప్ రెడ్డి తల్లి మరణించిందన్న విషయం తెలియడంతో పలువురు చిత్ర ప్రముఖులు సందీప్ తల్లి మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.