శ్రీరెడ్డి పై యాక్షన్ తీసుకుంటానంటున్న శేఖర్ కమ్ముల


director sekhar kammula fire on srireddy

తనపై అకారణంగా అసత్య ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తక్షణం క్షమాపణ చెప్పకపోతే తగిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇస్తున్నాడు దర్శకులు శేఖర్ కమ్ముల . తెలుగునాట శ్రీరెడ్డి లీక్స్ అంటూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . గతకొద్ది రోజులుగా చిత్ర పరిశ్రమలోని పలువురు హీరోలు , దర్శక నిర్మాతలు నాకు అవకాశం ఇస్తామంటూ అందరూ తమ శారీరక అవసరం తీర్చుకున్నారు కానీ ఛాన్స్ లు ఇచ్చినవాళ్లు లేరని చాలామంది పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .

ఇక తాజాగా శేఖర్ కమ్ముల పై సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి దాంతో ఆమె ఆరోపణలకు షాక్ తిన్న శేఖర్ కమ్ముల సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ నీవు నాపై చేసిన ప్రతీ అక్షరం తప్పు అని క్షమాపణ చెప్పకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసాడు . ఈ శ్రీరెడ్డి లీక్స్ ఇంకా ఎవరెవరిని తాకనున్నాయో చూడాలి .