రోజా భర్తకు కీలక పదవి


R.K. Selvamani
R.K. Selvamani

నగరి శాసనసభ్యురాలు , సినీ నటి రోజా భర్త సెల్వమణి ని  కీలక పదవి వరించింది . ఎన్నికల్లో గెలిచింది రోజా అయితే ఆమె భర్తకు కీలక పదవి లభించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సెల్వమణి ప్రముఖ దర్శకులు అన్న విషయం తెలిసిందే . 90 వ దశకంలో దర్శకుడిగా సత్తా చాటిన సెల్వమణి ఇప్పుడు మాత్రం మెగా ఫోన్ పట్టడం లేదు .

అయితే తమిళనాట దర్శకుల సంఘం కు ఎన్నికలు జరిగాయి కాగా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన సెల్వమణి ఘనవిజయం సాధించాడు . దర్శకుల సంఘం అధ్యక్షుడి గా ఎన్నికయ్యాడు సెల్వమణి . దర్శకుడిగా మంచి ఊపున్న సమయంలో రోజా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . రోజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణిస్తుండగా సెల్వమణి మాత్రం తమిళనాట రాజకీయం చేస్తున్నాడు .