మహేష్ బాబు ని పక్కన పెట్టిన డైరెక్టర్


Mahesh Babu
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలని తహతహలాడాడు దర్శకులు సందీప్ రెడ్డి వంగా కానీ కబీర్ సింగ్ సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ లో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి దాంతో మహేష్ బాబు సినిమాని పక్కన పెట్టేశాడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు గా పరిచయమైన సందీప్ ఆ తర్వాత మహేష్ బాబు తో అలాగే చరణ్ తో కూడా సినిమాలు చేయాలని అనుకున్నాడు.

ఆమేరకు మహేష్ ని , చరణ్ ని కలిసాడు కూడా. అయితే ఈలోపు మహేష్ బిజీ గా ఉండటంతో అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు. అది మాములు హిట్ అవుతుందను కుంటే ఏకంగా 300 కోట్ల వసూళ్ళ ని రాబట్టింది దాంతో బాలీవుడ్ లో ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది దాంతో పాటే బోలెడు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. దాంతో మహేష్ బాబు ని పక్కన పెట్టి బాలీవుడ్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట సందీప్ రెడ్డి వంగా .