చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కోసం శంక‌ర్ స్పెష‌ల్ గిఫ్ట్‌?

చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కోసం శంక‌ర్ స్పెష‌ల్ గిఫ్ట్‌?
చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే కోసం శంక‌ర్ స్పెష‌ల్ గిఫ్ట్‌?

ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌ `ఆర్ఆర్ఆర్` తర్వాత దిగ్రేట్ డైరెక్ట‌ర్‌ శంకర్‌తో రామ్ చరణ్ వ‌ర్క్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నార‌డ‌ట‌.  అది ఇప్ప‌టికి దిల్ రాజు కార‌ణంగా సాకారం అవుతోంది. రామ్‌ చరణ్ –  శంకర్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే.  ఇది రామ్‌చ‌ర‌ణ్‌కు, శంక‌ర్‌కు 15 వ చిత్రం. కాగా దిల్ రాజు బ్యాన‌ర్‌కు 50వ చిత్రం.

ఈ మూవీ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి ఏదో ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతూనే వుంది. తాజా చ‌రణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 న అభిమానుల కోసం ఒక ట్రీట్ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ‌స్ట్ లుక్ లేదా టైటిల్ కానీ మ‌రేదైనా న్యూస్‌ని ఈ రోజు మేక‌ర్స్ షేర్ చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జూలైలో సెట్స్ పైకి రానున్న ఈ 2022 లో తెరపైప్రేక్ష‌కుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రం కోసం హిందీకి చెందిన కొందరు ప్రముఖ నటులు న‌టించే అవ‌కాశం వుంద‌ని, ఈ మూవీ ద్వారా స‌మ‌కాలీన ఓ సామాజిక సందేశః ణ‌స్త్రఫ‌థ్యంలో తెర‌కెక్కించ‌బోతున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుంత శంక‌ర్ హీరో కమల్ హాసన్‌తో `ఇండియన్ 2`ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ త‌రువాతే రామ్‌చ‌ర‌ణ్ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది.