శంక‌ర్ మ‌రో సీక్వెల్‌కు రెడీ అవుతున్నారా?


శంక‌ర్ మ‌రో సీక్వెల్‌కు రెడీ అవుతున్నారా?
శంక‌ర్ మ‌రో సీక్వెల్‌కు రెడీ అవుతున్నారా?

శంక‌ర్‌.. భారీ త‌నానికి పెట్టింది పేరు. క‌థ ఎలాంటి దైనా దానికి భారీ హంగుల్ని జోడించి ప్రేక్ష‌కుల‌కు ఐఫీస్ట్‌ని అందించ‌డం శంక‌ర్ ప్ర‌త్యేక‌త‌. `జెంటిల్‌మెన్` నుంచి `2.ఓ` వ‌ర‌కు శంక‌ర్ చేసిన సినిమాలు జాతీయ స్థాయిలో ద‌క్షిణాది సినిమాకు ప్ర‌త్యేక‌ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం శంక‌ర్ `ఇండియ‌న్‌` చిత్రానికి సీక్వెల్‌ని తెర‌కెక్కిస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ జంట‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు.

ఇదిలా వుంటే శంక‌ర్ త్వ‌ర‌లో మ‌రో సీక్వెల్‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 1999 న‌వంబ‌ర్ 7న విడుద‌లైన చిత్రం `ముద‌ల‌వ‌న్‌`. యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో `ఒకే ఒక్క‌డు` పేరుతో ఏ.ఎం.ర‌త్నం రిలీజ్ చేశారు. ఒక్క రోజు ముఖ్య‌మంత్రి అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. `నాయ‌క్‌` పేరుతో రీమేక్ అయి విజ‌యాన్ని సాధించింది.

ఈ చిత్రానికి సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఆలోచిస్తున్నార‌ట‌. ఈ సీక్వెల్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తార‌ని ప్రాచారం జ‌రుగుతోంది. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి అభిమానులు ప‌ట్టుబ‌డుతున్న వేళ విజ‌య్ రాజ‌కీయ నేప‌థ్యంలో సెటైరిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌పైకి రానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.