
భారతీయ తెరపై భారీ చిత్రాల దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు శంకర్. దర్శక జీనియస్‌గా పేరు తెచ్చుకుని దక్షిణాదికే గౌరవాన్ని తీసుకొచ్చారాయన. `జెంటిల్మెన్` సినిమాలో విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ఎండగట్టిన ఆయన `భారతీయుడు` చిత్రంతో ఇండియన్ కరెప్షన్ సిస్టమ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. `రోబో`, 2.ఓ చిత్రాలతో వందల కోట్లతో హాలీవుడ్ చిత్రాలే కాదు భారతీయ చిత్రాలు కూడా నిర్మితమవుతాయని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేయాలని ఎదురు చూడని హీరో లేడంటే అది అతిశయోక్తి కాదేమో. అంతగా సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ త్వరలో తెలుగు హీరో కోసం ఓ కథ రాయబోతున్నారని తెలిసింది.
ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా శంకర్ `ఇండియన్-2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1996లో వచ్చిన `ఇండియన్` చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా `ఇండియన్-2`ని తెరకెక్కిస్తున్నారాయన. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని `2.ఓ` ఫేమ్ అల్లిరాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. కమల్‌హాసన్ సేనాధిపతిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గ్వాలియర్‌లో జరుగుతోంది. ఇటీవల బయటికి వచ్చిన ఆన్ లొకేషన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. భోపాల్‌లో ఈ సినిమా కోసం దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొనగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లని చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా తరువాత హీరో విజయ్ హీరోగా సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ హీరోగా భారీ చిత్రానికి శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఓ సామాజిక అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుని శంకర్ ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారట. ఇప్పటికే ఓ లైన్ ని సిద్ధం చేసుకున్న శంకర్ హీరో విజయ్ సినిమా పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో నిమగ్నం కాబోతున్నాడని, ఇది భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త చరిత్రను సృష్టించనుందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ `జాన్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియయేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలిసింది.