పెళ్ళైన తర్వాత ఎక్కువ చిత్రాలు అంగీకరిస్తోంది


 director Shiva Nirvana to bring Naga Chaitanya and Samantha together012

పెళ్లి అయినప్పటికీ సినిమాల్లో నటించడం మానేసేది లేదని పెళ్లి కి ముందే స్పష్టం చేసింది సమంత . అయితే పెళ్లి అయినా తర్వాత ఏకంగా ఆరు సినిమాల్లో నటించడానికి ఒప్పుకుందట ! అందులో మరో విశేషం ఏంటంటే నాగచైతన్య తో కలిసి చేసే సినిమా . పెళ్లి కి ముందు ఈ ఇద్దరూ కలిసి ఏ మాయ చేసావే , ఆటోనగర్ సూర్య , మనం చిత్రాల్లో నటించారు . ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి నటించలేదు కానీ పెళ్లి అయ్యాక ఆ ఇద్దరితో కలిసి సినిమా చేయాలనీ భావించాడు నాని డైరెక్టర్ .

నాని హీరోగా నటించిన నిన్ను కోరి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు . మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ తాజాగా నాగచైతన్య ని కలిసి ఓ కథ ని చెప్పాడట . రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కే ఆ కథ నాగచైతన్య కు బాగా నచ్చిందట దాంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ! అయితే ఇందులో మీకు జతగా సమంత అయితే బాగుంటుందని చెప్పాడట ! ఇంకేముంది అనందంగా ఒప్పుకున్నారు . త్వరలోనే ఈ పెళ్ళైన జంట ని మరోసారి స్క్రీన్ పై చూడనున్నారు ప్రేక్షకులు . ఈ సినిమా నే కాకుండా ఇంకా స్పీడ్ పెంచి మరో అయిదు సినిమాల్లో కూడా నటించడానికి సమాయత్తం అవుతోందట సమంత .