బయోపిక్స్ పై సంచలన కామెంట్ చేసిన దర్శకుడు


director singeetham srinivasarao sensational comments on biopics

తెలుగునాట బయోపిక్ లు చాలానే వస్తున్నాయి కానీ వాటిలో నిజాలు ఎక్కడున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు . ఇప్పటికే మహానటి చిత్రం విడుదలై సంచలన విజయం సాధించినప్పటికీ , ఆ సినిమాపై బోలెడు విమర్శలు వచ్చాయి . సావిత్రి గొప్పతనం చూపించడానికి కొన్ని తప్పుడు సన్నివేశాలు చూపించారని అలాగే జెమిని గణేశన్ ని తక్కువ చేసి చూపించారని …….. వాస్తవాలను వక్రీకరించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే .

 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర బయోపిక్ , కత్తి కాంతారావు , కే విశ్వనాధ్ , ఇలా రకరకాల బయోపిక్ లు రెడీ అవుతున్నాయి . అయితే బయోపిక్ అనగానే కమర్షియల్ అంశాల కోసం , కమర్షియల్ హిట్ కోసం అసలు వాస్తవాలు చిత్రీకరించడం లేదని …… అసలు వాస్తవాలు ప్రజలకు తెలిస్తేనే అది నిజమైన బయోపిక్ అవుతుంది కానీ వాస్తవాలను వక్రీకరించి తీస్తే అది బయోపిక్ ఎలా అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసాడు సింగీతం శ్రీనివాసరావు . ఎన్టీఆర్ , కత్తి కాంతారావు , సావిత్రి , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల గురించి ఈ దర్శకుడి కి బాగా తెలుసు కానీ బయోపిక్ లలో అన్ని వాస్తవాలు చూపిస్తే అభిమానులు తట్టుకోవడం కష్టం మరి .

English Title: director singeetham srinivasarao sensational comments on biopics