శ్రీకాంత్ అడ్డాలకు హ్యాండ్ ఇచ్చిన నాని


హీరో నాని దర్శకులు శ్రీకాంత్ అడ్డాల కు హ్యాండ్ ఇచ్చాడు . గతకొద్ది రోజులుగా నాని – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానున్నట్లు వార్తలు వచ్చాయి దాంతో ఒక్కసారిగా దుమారమే చెలరేగింది . శ్రీకాంత్ అడ్డాల తో సినిమా భయపడిపోతున్నారు హీరోలు , నిర్మాతలు అలాంటిది నాని రిస్క్ చేయడం ఏంటి ? అని అనుకున్నారు . అంతేకాదు పెద్ద ఎత్తున వద్దని కోరుకున్నారు కూడా .

అయితే నాని – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో సినిమా అనే విషయం నాని చెవిన పడటంతో ఎట్టకేలకు స్పదించాడు . మీరు వింటున్న వార్త నిజం కాదు అంటూ పోస్ట్ చేసాడు దాంతో నాని ఫ్యాన్స్ షాక్ నుండి తేరుకున్నారు . శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు అయితే బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో ఇక ఈ దర్శకుడితో సినిమా అంటే భయపడుతున్నారు . దాంతో పాపం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాడు శ్రీకాంత్ అడ్డాల . ఇక ఇప్పుడేమో నాని సినిమా ఆల్మోస్ట్ సెట్ అయ్యిందనుకుంటే నాని హ్యాండ్ ఇవ్వడంతో షాక్ అయ్యాడు పాపం .