గీత గోవిందం ని మెచ్చుకున్న రాజమౌళి


director ss rajamouli tweet on geetha govindam గీత గోవిందం చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆ చిత్ర బృందం ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఇలాంటి చిత్రాన్ని నేను అస్సలు ఊహించలేదు , అయినా విజయ్ దేవరకొండ కు ఏం చేస్తున్నాడో బాగా తెలుసు , నేను ఈ చిత్రాన్ని చూసి సరదాగా నవ్వుకున్నాను , బాగా తీసావ్ పరశురామ్ అంటూ ట్వీట్ పెట్టాడు రాజమౌళి . అర్జున్ రెడ్డి చిత్రంలో అగ్రెసివ్ గా కనబడతాడు విజయ్ దేవరకొండ కానీ ఈ చిత్రంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా కనబడతాడు దాంతో రాజమౌళి షాక్ అయ్యాడట .

ఇక నిన్న విడుదలైన గీత గోవిందం చిత్రానికి హిట్ టాక్ వచ్చింది , విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లు వస్తున్నాయి దాంతో గీత గోవిందం చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . విజయ్ దేవరకొండ – రష్మిక జంట చూడముచ్చటగా ఉండగా వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా గోపీసుందర్ సంగీతం అందించాడు .

English Title : director ss rajamouli tweet on geetha govindam