మహేష్ కోసం శ్రమపడుతున్న సుకుమార్


director sukumar hardwork for mahesh babu

భరత్ అనే నేను చిత్రంతో సంచలన విజయం అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు దాని తర్వాత సుకుమార్ సినిమా ఉంటుంది . కుదిరితే సుకుమార్ సినిమాతో పాటుగా సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా ఉండొచ్చు అని తెలుస్తోంది ఎందుకంటే సుకుమార్ సినిమా అంటే అంత తొందరగా పూర్తి కాదు చాలా సమయం తీసుకుంటాడు పైగా మహేష్ లాంటి స్టార్ హీరో అంటే మరిన్ని జాగ్రత్తలు అవసరం …… దానికి మరో కారణం కూడా ఉంది .

 

మహేష్ – సుకుమార్ కాంబినేషన్ లో ” 1” నేనొక్కడినే వంటి ప్రయోగాత్మక చిత్రం వచ్చింది అయితే ఆ సినిమా మహేష్ నటనకు మంచి పేరు వచ్చింది కానీ డిజాస్టర్ కావడంతో మహేష్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు కాబట్టి ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమాకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటాడు సుకుమార్ . ఇటీవలే రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు సుకుమార్ . అంతేకాదు విమర్శకుల ప్రశంసలతో పాటు అందరి నుండి జేజేలు అందుకుంటున్నాడు సుకుమార్ . ఇక ఇప్పుడేమో మహేష్ కోసం కథ సిద్ధం చేసుకుంటున్నాడు . ఈసారి ఎలాగైనా సరే మహేష్ తో బ్లాక్ బస్టర్ కొట్టి మహేష్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నాడట సుకుమార్ అందుకే బాగానే శ్రమ పడుతున్నాడట .