డైరెక్టర్ కి యాక్సిడెంట్ – షాక్ లో ఫ్యాన్స్


డైరెక్టర్ కి యాక్సిడెంట్ – షాక్ లో ఫ్యాన్స్
డైరెక్టర్ కి యాక్సిడెంట్ – షాక్ లో ఫ్యాన్స్

“వెన్నెల కబడ్డీ కుళ్” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్. ఆ సినిమా అప్పట్లో సంచలనం. ఆ సినిమా హిట్ తరువాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత కార్తీ తో “నా పేరు శివ”, విశాల్ తో పల్నాడు “జయసూర్య” విలక్షణ నటుడు విక్రమ్ తో “వీడింతే” లాంటి సూపర్ హిట్ సినిమా సినిమాలు తీసిన ఆయన అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఉదయాన్నే మార్నింగ్ వాక్ తో పాటు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్నదర్శకుడు సుశీంద్రన్ యధావిధిగా ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి వెళ్ళిన సమయంలో, రోడ్డుమీద ఎదురుగుండా వచ్చినటువంటి బైక్ రైడర్ ఆయనను ఢీకొట్టడంతో అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తూ దర్శకుడు సుశీంద్రన్ సర్ కి ఎడమ చేయి విరిగింది. ఇంకా అనేక గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్న కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన “కెనడా క్లబ్”, “ఛాంపియన్” సినిమాలు ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించాయి. త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు తో పాటు మూవీ లవర్స్ కూడా పూజలు చేస్తున్నారు