పెళ్లి చూపులు విడుదలై అప్పుడే మూడేళ్లుPelli Chupulu Movie
Pelli Chupulu Movie

2016 జూలై 29 న విడుదలైన పెళ్లి చూపులు చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తో చరిత్ర సృష్టించాడు దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ . ఇక పెళ్లిచూపులు చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు . అయితే పెళ్లిచూపులు చిత్రం విడుదలై మూడేళ్లు అయిపొయింది కానీ ఇంతవరకు తన మూడో చిత్రాన్ని ప్రకటించలేదు తరుణ్ భాస్కర్ .

పెళ్లిచూపులు చిత్రం తర్వాత ఈ నగరానికి ఏమైంది అన్న చిత్రం చేసాడు . కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు . ఇక ఇప్పుడయినా కొత్త సినిమా ప్రకటిస్తాడేమో అనుకుంటే ఇంకా ఏది ప్రకటించలేదు . దాస్యం తరుణ్ భాస్కర్ నుండి మరో సూపర్ హిట్ కోరుకుంటున్నారు ప్రేక్షకులు .