రెండు కొత్త చిత్రాల‌ని ప్ర‌క‌టించిన తేజ‌!


రెండు కొత్త చిత్రాల‌ని ప్ర‌క‌టించిన తేజ‌!
రెండు కొత్త చిత్రాల‌ని ప్ర‌క‌టించిన తేజ‌!

కెమెరామెన్‌గా ఎన్నో గ్రేట్ ఫిల్మ్స్‌కి వ‌ర్క్ చేసిన తేజ `చిత్రం` సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన `శివ‌` చిత్రానికి సెకండ్ యూనిట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన తేజ `రంగీలా` చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే విభాగంలోనూ ప‌నిచేశారు. `జిస్ దేశ్‌మే గంగా ర‌హ‌తీహై` వ‌ర‌కు ఎన్నో హిందీ, తెలుగు చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసి చివ‌రికి ద‌ర్శ‌కుడిగా మారారు. చిత్రం, నువ్వు నేను, జ‌యం. నిజం, జై, అవున‌న్నా కాద‌న్నా… ఇలా దాదాపు 15 చిత్రాల్ని రూపొందించారు.

కొంత విరామం త‌రువాత `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంతో మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టారు. శ‌నివారం ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు తేజ రెండు చిత్రాల్ని ప్ర‌క‌టించారు. త‌ను చేయ‌బోతున్న రెండు సినిమాల టైటిల్స్‌తో పాటు అందులో న‌టించ‌నున్న హీరోల వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఇందులో `అలిమేలు మంగ వెంక‌ట ర‌మ‌ణ‌` చిత్రాన్ని హీరో గోపీచంద్‌తో చేయ‌బోతున్నారు.

`రాక్ష‌స‌రాజు రావ‌ణాసురుడు` చిత్రాన్ని రానా హీరోగా చేయ‌బోతున్నారు. గ‌త కొన్ని రోజులుగా ద‌ర్శ‌కుడు తేజ ఈ పేర్ల‌తో రెండు చిత్రాల్ని రూపొందించ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌ర‌గుతోంది. తాజాగా ఈ రెండు చిత్రాల్ని ప్ర‌క‌టించి ఆ ప్ర‌చారానికి మ‌రింత ఊపునిచ్చారు. ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తియింద‌ని, త్వ‌ర‌లోనే ఈ చిత్రాల్ని ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. న‌టుడిగా `జ‌యం` చిత్రం గోపీచంద్‌కు ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచి అత‌న్ని నిల‌బెట్టిన విష‌యం తెలిసిందే.