ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ కామెంట్


నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చి రెండు భాగాలూ కూడా డిజాస్టర్ అయ్యాయి దాంతో తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకొని మంచి పని చేసాడు అంటూ పలువురు దర్శక నిర్మాతలు తేజ ని కొనియాడారట ! ఈ విషయాన్నీ తాజాగా స్పష్టం చేసాడు తేజ . బెల్లంకొండ సాయి శ్రీనివాస్కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సీత చిత్రానికి దర్శకత్వం వహించిన తేజ మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ పై కామెంట్ చేసాడు .

ఎన్టీఆర్ బయోపిక్ కు న్యాయం చేయలేను కాబట్టే తప్పుకున్నాను అయితే నేను ఆ సినిమా నుండి తప్పుకున్నప్పుడు చాలామంది ఎందుకు మంచి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నావ్ అంటూ ప్రశ్నించారు . అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఫలితాలు చూసాక ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకొని మంచి పని చేసావ్ అంటూ నన్ను విమర్శించిన వాళ్లే పొగిడారు . ఎన్టీఆర్ బయోపిక్ చేయకపోవడం వల్ల నాకు చాలామంచి పేరు వచ్చిందని అంటున్నాడు తేజ .