ఊపిరి పీల్చుకున్న తేజ


Director Teja great escape from disaster

ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న దర్శకులు తేజ రెండు భాగాలు కూడా డిజాస్టర్ లు కావడంతో హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాడు . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు ప్లాప్ అయితే తేజ సంతోషపడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అసలు ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకులు తేజ నే ! అయితే బాలయ్య తో కొన్ని విషయాల పట్ల విబేధాలు వచ్చాయి దాంతో నేను అనుకున్నట్లుగా ఎన్టీఆర్ బయోపిక్ రావడం కష్టం కాబట్టి తప్పుకోవడమే బెటర్ అని భావించిన తేజ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు .

 

తేజ తప్పుకోవడంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం క్రిష్ వచ్చి చేరాడు , ఇంకేముంది సినిమాపై అంచనాలు పెరిగాయి కానీ ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు డిజాస్టర్ అయ్యాయి . క్రిష్ పరువు పోయింది , తేజ ఈ సినిమా నుండి తప్పుకొని మంచి పనే చేసాడు అన్నది తేలింది మొత్తానికి దాంతో తేజ సంతోషంగా ఉన్నాడట పెద్ద డిజాస్టర్ నుండి తప్పుకున్నందుకు .

English Title : Director Teja great escape from disaster

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce