బ్రేకింగ్ న్యూస్ : స్టార్ డైరెక్టర్ కు పాజిటివ్ !Director Teja tests Coronavirus positive
Director Teja tests Coronavirus positive

కరోనా మహమ్మారి విజృభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీ లు, పొలిటికల్ లీడర్స్ ని కూడా వదలడం లేదు. ఇటీవల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కుటుంబాన్ని అంటుకున్న కరోనా ఆ తరువాత గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీని తాకడం భయాందోళనకు గురిచేసింది. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు కూడా సోకడం సంచలనంగా మారింది.

ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు ఆయనే తేజ. ఇటీవలే కరోనా గురించి, దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చిన తేజ తాజాగా కరోనా బారిన పడటంతో సినీ సెలెబ్రిటీలు భయంతో వణికిపోతున్నారు. నెక్స్ట్ నువ్వే అన్నట్టు గా పరిస్థితి మారడంతో ఇండస్ట్రీలో వున్న స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ అంతా భయపడుతున్నారట.
డైరెక్టర్ తేజకు వైరస్ సోకడానికి ప్రధాన కారణం ఇటీవల తేజ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ ని ప్రారంభించారు. బిగ్ బాస్ ఫెమ్ నందిని రాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ షూటింగ్ కారణంగానే తేజ వైరస్ బారిన పడినట్టు తెలిసింది. సింటమ్స్ కనిపించడంతో తేజ టెస్ట్ చేయించుకున్నారట. టెస్ట్ లో పోసిటివ్ రావడంతో ఆయన షాక్ కు గురయ్యారని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న  తేజ ఇంటివద్దే వుంటూ మెడిసిన్ వాడుతున్నారట.