పెళ్లిచూపులు డైరెక్టర్ తప్పు చేస్తున్నాడా ?


Director Tharun bhascker dhaassyam turned as hero

పెళ్లిచూపులు చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ . చిన్న చిత్రంగా అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన పెళ్లి చూపులు చిత్రం రిలీజ్ అయ్యాక ప్రభంజనం సృష్టించింది . దాంతో దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ పేరు మారుమోగింది . అయితే రెండో సినిమాకు చాలా సమయమే తీసుకున్నాడు ఈ దర్శకుడు . కానీ రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు .

అయితే మధ్యలో మహానటి , సమ్మోహనం చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించాడు దాంతో నటన కాస్త ఇప్పుడు ప్రొఫేషన్ గా మారినట్లుంది తాజాగా హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్ . దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలను , ప్రేక్షకుల రివార్డులను , ప్రభుత్వ అవార్డులను అందుకున్న తరుణ్ ఇప్పుడు ఇలా నటుడిగా అందునా హీరోగా మారితే అది సరైన నిర్ణయమేనా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది . దర్శకుడుగా సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ హీరోగా మారితే అక్కడ సక్సెస్ అయితే ఫరవాలేదు కానీ హీరోగా నటించే సినిమా ప్లాప్ అయితే రెంటికి చెడిన రేవడిలా అవుతుంది పరిస్థితి .

English Title: Director Tharun bhascker dhaassyam turned as hero