తరుణ్ భాస్కర్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో


director  Tharun Bhascker next with Jr NTRపెళ్లి చూపులు చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ . తాజాగా ఈ దర్శకుడు ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అయితే ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కలిసాడు దర్శకులు తరుణ్ భాస్కర్ . తన సినిమా ప్రీమియర్ షోకి రావాల్సిందిగా ఆహ్వానించాడు తరుణ్ దానికి ఎన్టీఆర్ అంగీకారం తెలిపాడట !

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది పదేళ్ల క్రితమే ! రాముడు – భీముడు చిత్రాన్ని రీమేక్ చేయాలనీ అప్పట్లో స్వర్గీయ రామానాయుడు ప్లాన్ చేసారు ఎన్టీఆర్ కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కూడా . అయితే ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఆ రీమేక్ సినిమా అటకెక్కింది సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ నటించిన ” నరసింహుడు ” సినిమా విడుదల సమస్య ని ఎదుర్కొంది అప్పుడు రామానాయుడు , సురేష్ బాబు మధ్యవర్తిత్వం నిర్వహించి నరసింహుడు ని గట్టెకించారు . కట్ చేస్తే పదేళ్లు గడిచిపోయాయి , ఇప్పుడు ఎన్టీఆర్ కు ఆ సమయం వచ్చినట్లుంది . అలాగే తరుణ్ భాస్కర్ తో ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా తీసిన సురేష్ బాబు తన తదుపరి చిత్రాలు కూడా సురేష్ ప్రొడక్షన్స్ కే చేయాలనీ ఒప్పందం చేసుకున్నాడు . ఆ ఒప్పందంలో భాగంగా తరుణ్ కథ ఎన్టీఆర్ కు నచ్చితే ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడం ఖాయం దాంతో ముగ్గురికి కూడా చేసుకున్న ఒప్పందాలు నెరవేరినట్లు అవుతాయి . తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది హిట్ అయితే ఎన్టీఆర్ -తరుణ్ భాస్కర్ ల సినిమా అధికారికంగా ప్రకటించడం ఖాయం .

English Title : director Tharun Bhascker next with Jr NTR