మాట‌ల మాంత్రికుడు కూడా… నేను సైతం..


మాట‌ల మాంత్రికుడు కూడా... నేను సైతం..
మాట‌ల మాంత్రికుడు కూడా… నేను సైతం..

ప్ర‌పంచం క‌రోనా కార‌ణంగా హాహా కారాలు చేస్తోంది. ఎటు చూసినా క‌రోనా… కోర‌నా…దీన్ని అరిక‌ట్టాలంటే ప్ర‌భుత్వాల‌కు క‌త్తిమీద సాముగా మారింది. మ‌న చుట్టూ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఎవ‌రో ఒక‌రు నిజాన్ని దాచి బ‌య‌టికి రావ‌డం వ‌ల్ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే వున్నాయి. తాజాగా తెలంగాణ‌లో అదీ కొత్తగూడెంలో మూడేళ్ల పిల్ల‌వాడికి, ఓ మ‌హిళ‌కీ కూడా క‌రోనా వైర‌స్ సోక‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇదిలా వుంటే దేశ ప్ర‌ధాని ఈ ప్ర‌మాదాన్ని గుర్తించి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌కు పిలుపునిచ్చారు. దీంతో అయినా క‌రోనా క‌ట్టడి అవుతుంద‌ని క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే ప్ర‌ధాని 1500 కోట్ల‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తెలంగాణ‌, ఏపీల్లోనూ క‌రోనా క‌ట్ట‌డికి భారీ మొత్తాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ఉభ‌య రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌క‌టించారు.

దీనికి సినీ సెల‌బ్రిటీలు కూడా మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. భారీ స్థాయిలో ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టిస్తూ త‌మ గొప్ప మ‌న‌సును చాటుకుంటున్నారు. జ‌న‌సేనా అధినేత రెండు కోట్లని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిస్తే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ నేను సైతం అంటూ 20 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. తెలంగాన సీఎం రిలీఫ్ ఫండ్‌కు 10 ల‌క్ష‌లు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 10 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ఈ మొత్తాన్ని ఇరు రాష్ట్రాల సీఎంల‌కు త్వ‌ర‌లోనే అందించ‌నున్నార‌ట‌.

Credit: Twitter