బ్లాక్ బ్యూటీ ని పట్టేసిన త్రివిక్రమ్


Director trivikram eyes on eesha rebbaదర్శకులు త్రివిక్రమ్ హీరోయిన్ ల స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే . ఈ దర్శకుడి చిత్రంలో పలువురు భామలు నటిస్తుంటారు కాగా వాళ్లకు వరుస పెట్టి అవకాశాలు ఇస్తుంటాడు . ఇప్పటికే ఆ లిస్ట్ లో పలువురు భామలు ఉండగా తాజాగా ఆ లిస్ట్ లో బ్లాక్ బ్యూటీ ఈషా రెబ్బా కూడా చేరింది . ”అంతకుముందు ఆ తర్వాత ” చిత్రంతో తెలుగులో పరిచయమైన తెలుగు భామ ఈ ఈషా రెబ్బా . ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి .

అయితే అల్లరి నరేష్ తో చేసిన బందిపోటు ఘోర పరాజయం పాలయ్యింది , ఆ తర్వాత అమీ తుమీ చిత్రం, అ చిత్రం చేసింది కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ లభించింది త్రివిక్రమ్ రూపంలో . అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ ని ప్రేమించే యువతిగా ఈషా రెబ్బా నటిస్తోందట !

త్రివిక్రమ్ చూపు ఈషా రెబ్బా పై పడింది దాంతో ఆ భామని సెలక్ట్ చేసాడు . ఇక ఈ బ్లాక్ బ్యూటీ కూడా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లపై చాలా ఆశలు పెట్టుకుంది . ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమెత చిత్రం తో టాప్ రేంజ్ కి వెళ్తానని ఆశపడుతోంది మరి ఈ భామ ఆశలు నెరవేరుతాయా చూడాలి . దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు త్రివిక్రమ్ .

English Title: director trivikram eyes on eesha rebba