ఫ్యాక్షన్ ని నమ్ముకున్న త్రివిక్రమ్


director trivikram hopes on faction storyఅజ్ఞాతవాసి చిత్రం ప్లాప్ కావడంతో దర్శకులు త్రివిక్రమ్ దిమ్మ తిరిగిపోయింది దాంతో బయట ఫంక్షన్ లలో పాల్గొనాలంటే భయపడిపోయాడు అందుకే ఎన్టీఆర్ తో చేసే సినిమా సెట్స్ మీదకు వెళ్లేంత వరకు మొహం చూపించలేదు . కట్ చేస్తే ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది . మొదటి షెడ్యూల్ లోనే పోరాట దృశ్యాలను చిత్రీకరించాడు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ ఫైట్ సినిమాకు కీలకమట . రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ఇంతకుముందు సినిమాలు చేసాడు . అందులో ఆది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే సాంబ పరాజయం పొందింది .

ఇక దర్శకులు త్రివిక్రమ్ విషయానికి వస్తే ……. పూర్తిస్థాయి ఫ్యాక్షన్ చిత్రాన్ని చేయలేదు కానీ అతడి సినిమాలో ఏదో ఒక మూల ఆ వాసనా వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు . అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో కాస్త సీమ ఫ్యాక్షన్ కాస్త ఎక్కువగానే ఉంటుందట . సీమ ఫ్యాక్షన్ కథ అయినప్పటికీ రెగ్యులర్ ఫార్మేట్ కు భిన్నంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉంటాయట . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అజ్ఞాతవాసి చిత్రంతో డిజాస్టర్ ఎదుర్కొన్న త్రివిక్రమ్ ఫ్యాక్షన్ కథ తో హిట్ కొడతాడా చూడాలి .