ఆరోపణలపై త్రివిక్రమ్ స్పందించడం లేదు


director trivikram not respond on poonam kaur allegationదర్శకులు త్రివిక్రమ్ పై హీరోయిన్ పూనం కౌర్ రకరకాల ఆరోపణలు చేసింది , అయితే నేరుగా త్రివిక్రమ్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ అతడే అని ఓ చిన్న హింట్ ఇచ్చింది . ఇప్పటివరకు రెండుసార్లు అతడి పై ఆరోపణలు చేసింది అయితే ఆ ఆరోపణలను తిప్పి కొట్టడం లేదు లేదా ఆమె ఆరోపించింది తప్పు అని ఖండించడమూ లేదు . తాజాగా ఓ పత్రిక కు త్రివిక్రమ్ ఇంటర్వ్యూ ఇచ్చారు . ఎంతసేపు పవన్ కళ్యాణ్ గురించి అలాగే ఎన్టీఆర్ సినిమా గురించి చెప్పాడు తప్ప పూనం కౌర్ ఆరోపణలపై మాత్రం స్పందించలేదు .

త్రివిక్రమ్ హీరోయిన్ లను వాడుకొని వదిలేస్తాడని అలాగే నన్ను కూడా వాడుకోవాలని చూశాడని అజ్ఞాతంలో మోసం చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది పూనం కౌర్ . ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ….. ఎన్టీఆర్ హీరోగా ” అరవింద సమెత ” వీర రాఘవ అనే సినిమా చేస్తున్నాడు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు . పైగా ఎన్టీఆర్ కు అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ బాగా నచ్చిందని కూడా అంటున్నాడు . ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .