త్రివిక్రమ్ కు పెద్ద షాక్ ఇచ్చిన షకలక శంకర్


director trivikram shocked with shakalaka shankarదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు షకలక శంకర్ పెద్ద షాక్ ఇచ్చాడు . ఇంతకీ షకలక శంకర్ త్రివిక్రమ్ కు ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా …… ఓ కథ తీసుకొని అతడి దగ్గరకు వెళ్లి నేను హీరోగా నటిస్తాను మీరు డబ్బులు పెట్టి సినిమా తీయండి 2 కోట్లు పెడితే చాలు 12 కోట్లకు పైగా తిరిగి వస్తాయి అని చెప్పాడట ! దాంతో షాక్ అయ్యాడట త్రివిక్రమ్ …… నువ్ హీరో , నేను డబ్బులు పెట్టాలి అది కుడి రెండు కోట్లా అంటూ ఆశ్చర్యపోయాడట ! అయితే రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమన్నందుకు కాకుండా షకలక శంకర్ హీరోగా నటిస్తానని అన్నందుకు షాక్ అయ్యాడట త్రివిక్రమ్ .

కమెడియన్ గా మంచి వేషాలు వస్తున్నాయి కదా ! ఇప్పుడు హీరోగా నటించడం అవసరమా ? అని కూడా అడిగాడట కానీ షకలక శంకర్ మాత్రం హీరోగా నటించడం ఖాయం అంటూ త్రివిక్రమ్ ముఖం మీదే చెప్పాడట . అయితే నేను ఇప్పుడు సినిమాకు పెట్టుబడి పెట్టలేనని ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాను కాబట్టి అంటూ తప్పుకున్నాడట . శంకర్ మాత్రం పట్టు విడవకుండా బోలెడుమంది దగ్గరకు వెళ్లి ట్రై చేసాడట కానీ కుదరలేదు అదే సమయంలో నెల్లూరు కి చెందిన వ్యక్తి ” శంభో శంకర ” చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాడు . అలా రూపొందిన శంభో శంకర్ రెడీ అయ్యింది ఈనెల 29న విడుదల అవుతోంది కూడా .

English Title: director trivikram shocked with shakalaka shankar