రవితేజ ఫోటో ఫేక్ అట !

Ravi Teja
Ravi Teja

నిన్న రవితేజ లుక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అంతగా వైరల్ కావడానికి కారణం ఏంటో తెలుసా …….. రవితేజ పాతికేళ్ల యువకుడిగా కనిపించడమే! రవితేజ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలో కుర్రాడిలా కనిపిస్తున్నాడు దాంతో ఆ ఫోటో వైరల్ అయ్యింది.

అయితే అది ఫేక్ అని దర్శకులు వి ఐ ఆనంద్ ట్వీట్ చేసాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవితేజ లుక్ నిజం కాదని , అసలు లుక్ ని త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించాడు వి ఐ ఆనంద్.

రవితేజ తాజాగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్నాడు.కాగా ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వి ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

గతకొంత కాలంగా రవితేజ కు సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా సతమతం అవుతున్నాడు, దాంతో డిస్కో రాజా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే నిన్న విడుదలైన రవితేజ ఫోటో నిజమే అనుకొని పలువురు సినీ ప్రముఖులు మెచ్చుకొని తప్పులో కాలేశారు టెక్నాలజీ వల్ల.