కొత్త దర్శకులకి పాత దర్శకులు, నిర్మాతలు చెయ్యి అందిస్తున్నారు


కొత్త దర్శకులకి పాత దర్శకులు, నిర్మాతలు చెయ్యి అందిస్తున్నారు
కొత్త దర్శకులకి పాత దర్శకులు, నిర్మాతలు చెయ్యి అందిస్తున్నారు

సినిమా తరం మారుతుంది. కొత్త కొత్త కథలు, నిర్మాతలు, కథా నాయకులు, నాయికలు, హాస్య కథానాయకులు, సంగీత దశ్శకులు ఇలా 24 చేతి పనులు ఉన్న సినిమా పరిశ్రమ లోకి అడుగుపెడుతున్నారు. మరి అందులో మొదటి ప్రయత్నానికి మంచి సక్సెస్ వచ్చి సంబరపడి హడావిడిగా కెరీర్ ని నాశనము చేసుకున్న వారు ఉన్నారు. ఎన్ని విజయాలు వచ్చిన వారి పని వారు చేసుకున్న వారు కూడా ఉన్నారు.

మరి పాత దర్శకులు, నిర్మాతలు అలా హడావిడిగా కెరీర్ ని నాశనం చేసుకున్న వారికంటే, ప్రతిభ ఉండి ఎన్ని విజయాలు వచ్చిన తమ పని తాము చేసుకుంటున్న వారికి మద్దతు ఇస్తున్నారు. వారి భవిష్యత్తు ప్రణాళికలకు సహాయం చేస్తున్నారు. మొదటి సినిమాగా విడుదల అయిన ‘మెంటల్ మదిలో’ దర్శకులు ‘వివేక్ ఆత్రేయ’ కి ఇప్పుడు మాటల మాంత్రికులు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ అలాగే నిర్మాత ‘దిల్ రాజు’ తోడయ్యారు.

మెంటల్ మదిలో సినిమా యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా అన్ని రకాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలకి అందరూ ఫిదా అయిపోయారు. అందువలన వివేక్ ఆత్రేయ కి రెండు నిర్మాణ సంస్థలు మూడవ సినిమా నుండి చేయబోయే ప్రతి సినిమాలకి తోడు ఉండాలి అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దిల్ రాజు గారు మన వాడికి సహాయం చెయ్యాలని దిగి వచ్చారు.

ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘శ్రీ వెంకటేశ్వర క్రీయేషన్స్’ వారు వివేక్ ఆత్రేయ ప్రతిభకి మంచి అవకాశం ఇచ్చారు. బ్రోచేవారివురురా సినిమా తరువాత సమయం తీసుకున్న వివేక్ ఇక నుండి వరుసగా సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. తన మూడవ సినిమాకి త్రివిక్రమ్ గారు కూడా దగ్గరుండి పర్సనల్ గా ఆ ప్రాజెక్ట్ లో ఉండాలనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దిల్ రాజు గారి మద్దతు లభిస్తుండటం మన వాడికి ఇంకొక బూస్ట్ అప్ అని చెప్పవచ్చు.