నష్టపోయి అమ్మాడా ? లేక ……


Director vv vinayak sold his theatres in vizag

దర్శకులు వివివినాయక్ తాజాగా విశాఖపట్టణం లో ఉన్న తన థియేటర్ లను అమ్మేశాడు దాంతో ఆర్ధికంగా నష్టాల్లో ఉండి అమ్ముకున్నాడా ? లేక పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని అమ్మాడా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . అయితే దర్శకుడిగా వివివినాయక్ కు అంతగా కాలం కలిసి రావడం లేదు . గతకొంత కాలంగా ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందినవే ! ఒక్క ఖైదీ నెంబర్ 150 తప్ప .

బాలయ్య తో సినిమా అనుకున్నాడు , ఆశపడ్డాడు కానీ కుదరలేదు . బాలయ్య తాజాగా బోయపాటి శ్రీను తో తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇక వినాయక్ థియేటర్ ల విషయానికి వస్తే …… దర్శకుడిగా సంచలనం సృష్టిస్తున్న రోజుల్లో బాగా డబ్బులు రావడంతో విశాఖ లోని థియేటర్ లను కొని వాటిని ఆధునీకరించి ” వి మ్యాక్స్ ” గా నామకరణం చేసాడు . అయితే తాజాగా ఓ పెద్ద మాల్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో వాళ్లకు తన థియేటర్ లను అమ్మేసాడట .

English Title: Director vv vinayak sold his theatres in vizag