జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన  వినాయక్Director VVVinayak sensational comments on Jagan
Director VVVinayak sensational comments on Jagan

దర్శకులు వివివినాయక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు . జగన్ నాకు స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానించి రాజకీయ వర్గాలతో పాటుగా సినిమారంగంలో కూడా సంచలనం సృష్టించాడు . తెలుగు చిత్ర రంగంలో ఎక్కువగా తెలుగుదేశం అనుకూల వర్గాలు అన్న విషయం తెలిసిందే . జగన్ ముఖ్యమంత్రి అయి రెండు నెలలు దాటినా సినీ ప్రముఖులు ఇంకా జగన్ ని కలవలేదు కానీ దర్శకులు వివివినాయక్ మాత్రం నాకు జగన్ స్ఫూర్తి అంటూ మాట్లాడటం సంచలనం సృష్టించింది .

నిన్న విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వినాయక్ జగన్ పై ప్రశంసలు కురిపించాడు . దాంతో వినాయక్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం ఖాయమని వినిపిస్తోంది . అసలు గత ఎన్నికల్లోనే వినాయక్ పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాలేదు కానీ తాజాగా వినాయక్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ పంచన చేరడం ఖాయంగా కనిపిస్తోంది .