లిప్ లాక్ చేయమని ఎవరూ అడగలేదని బాధపడుతోంది


Tamannah
Tamannah

లిప్ లాక్ లు ఇవ్వడానికి నేను రెడీ అయితే ఇప్పటివరకు నన్ను ఎవరూ లిప్ లాక్ చేయమని కోరలేదని బాధపడుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా . తాజాగా ఈ భామ నెక్స్ట్ ఏంటి అనే బోల్డ్ మూవీలో నటించింది . కాగా ఆ సినిమా రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ లిప్ లాక్ ల గురించి రొమాన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేసింది . లవ్ , సెక్స్ గురించి ఆలోచించే కుర్రాళ్లకు నెక్స్ట్ ఏంటి సినిమా నచ్చుతుందని తేల్చి చెప్పింది .

అంతేకాదు కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ లు ఇవ్వడానికి నేను రెడీ కానీ ఇంతవరకు నన్ను ఏ దర్శకుడు కూడా అలా వాడుకోలేదని నిరాశని వ్యక్తం చేసింది . నాకు బోల్డ్ కంటెంట్ తో ఉన్న సినిమాల్లో నటించాలని ఆసక్తిగా ఉండేది కానీ అలాంటి చిత్రాలు నాకు రాలేదు అంటూ తప్పంతా హీరోలది , దర్శక నిర్మాతలది అంటూ వాళ్లపై నెట్టేసింది తమన్నా . ఇప్పటికైనా తమన్నా ఓపెన్ గా చెప్పింది కాబట్టి దర్శక నిర్మాతలు బోల్డ్ కంటెంట్ తో ఉన్న సినిమాలు ఈ భామకు  ఆఫర్ చేస్తారేమో చూడాలి . 

English Title : Directors never demanded me for lip lock says tamannah