క్లీవేజ్ చూపించమన్నాడంటున్న హేట్ స్టోరీ భామ


Surveen Chawla
క్లీవేజ్ చూపించమన్నాడంటున్న హేట్ స్టోరీ భామ

హేట్ స్టోరీ 2 చిత్రంలో తన హాట్ అందాలతో అందరికీ సుపరిచితురాలైన సుర్వీన్ చావ్లా తనకెదురైన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. గతేడాది నుండి కాస్టింగ్ కౌచ్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపుతోంది. కంగనా రనౌత్ నుండి శ్రీరెడ్డి వరకూ చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా ముందుకు వచ్చి తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు.

ఇప్పుడిప్పుడే ఈ ఉదంతం కొంత సద్దుమణుగుతోంది అనుకుంటుండగా సుర్వీన్ చావ్లా కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్ లో ఇప్పటిదాకా దాదాపు ఐదుగురు దర్శకనిర్మాతలు తనని వేధించారని చెప్పింది. ఒక బాలీవుడ్ దర్శకుడు అయితే తనకు క్లీవేజ్ చూపించమని డిమాండ్ చేసాడని వాపోయింది.

మరొక సౌత్ ఫిలిం మేకర్ అయితే నీకు లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ ఉంది. నీ బాడీ అణువణువూ నాకు తెలియాలి అన్నాడు. అది నాకు షాకింగ్ గా అనిపించింది. మరొక దర్శకుడు అయితే నా తొడలు చూపించమని కోరాడు అని చెప్పింది. తెలుగులో శర్వానంద్ సరసన రాజు మహారాజు సినిమాలో నటించిన సుర్వీన్, ప్రస్తుతం సినిమాలకు దూరమై వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది.