క్లాసిక్ చిత్ర పరువు తీసిన @ నర్తనశాల


disastar talk to nartanasala

1963 లో వచ్చిన నర్తనశాల ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన నర్తనశాల చిత్రం వచ్చి 55 సంవత్సరాలు అయినప్పటికీ ఆ చిత్రం ఇప్పటికి ఎప్పటికి కూడా ఎవరు గ్రీన్ . ఎన్టీఆర్ బృహన్నలగా నటించి యావత్ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను పొందడమే కాకుండా ఏ రీతిన చూసిన క్లాసికల్ చిత్రంగా చెక్కుచెదరని విజయాన్ని సొంతం చేసుకుంది కాగా ఆ పేరుతో తాజాగా నాగశౌర్య హీరోగా @ నర్తనశాల అనే చిత్రం చేసారు కాగా నిన్న విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయం పొందడమే కాకుండా విమర్శల పాలు అవుతోంది . అంతేకాదు ఎవర్ గ్రీన్ సినిమా టైటిల్ ని పెట్టి ఆ చిత్ర పరువు తీశారు నాగశౌర్య అండ్ కో .

గే కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన @ నర్తనశాల చిత్రం పై గొప్పలు చెప్పారు విడుదలకు ముందు . మా సినిమా బాగుంటేనే చెప్పండి లేదంటే మా సినిమాకు రాకండి అని కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మా సినిమాకు రండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా ఆ థియేటర్ ల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు ప్రేక్షకులు .

English Title: disastar talk to @nartanasala