పాపం సూర్య సినిమా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?


Suriya
పాపం సూర్య సినిమా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గజిని, శివపుత్రుడు, వీడొక్కడే వంటి చిత్రాలతో సూర్య తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒకానొక దశలో సూర్య సినిమాకు 20 కోట్ల దాకా ఇక్కడ బిసినెస్ జరిగే పరిస్థితి. ఇటీవలే విడుదలైన సూర్య సినిమా బందోబస్త్ చిత్రానికి 10 కోట్ల మేర బిజినెస్ జరిగిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇదే అధ్వాన్నం అనుకుంటే దానికంటే దారుణం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

బందోబస్త్ చిత్రం చాలా తక్కువ అంచనాలతో విడుదలైన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్రంలో విషయం లేదని క్రిటిక్స్ తేల్చేశారు. విఐ ఆనంద్ వంటి టాలెంటెడ్ దర్శకుడి నుండి ఇలాంటి ఔట్పుట్ ఏంటని విమర్శకులు దుయ్యబట్టారు. తమిళంలో కూడా ప్లాప్ అయిన ఈ చిత్రం తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం దాదాపుగా ఫుల్ రన్ కి వచ్చేసింది. ఆడిన చోట్ల కూడా మినిమం వసూళ్లు రావట్లేదు. ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం కోటి 75 లక్షల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల నుండి వసూలు చేసింది.

సూర్య వంటి స్టార్ హీరో తెలుగులో కనీసం 2 కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం నిజంగా శోచనీయం. సూర్య ఎంచుకుంటున్న చిత్రాలే ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. పసలేని కథలతో సూర్య తెలుగులో తన మార్కెట్ ను దాదాపు సున్నాకి తెచ్చేసుకున్నాడు.