డిస్కో రాజా 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


డిస్కో రాజా 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
డిస్కో రాజా 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ డిస్కో రాజా విడుదలకు ముందు మంచి అంచనాలను ఏర్పరిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రవితేజకు హిట్ చాలా అవసరం. అయితే డిస్కో రాజా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రానికి యావరేజ్ రేటింగులే వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ కథ అని చెప్పినా కానీ డిస్కో రాజాలో తర్వాతి వ్యవహారం రొటీన్ గానే ఉందంటూ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. 22 కోట్లకు బిజినెస్ చేసిన ఈ చిత్రానికి సంక్రాంతి సినిమాలు ఇంకా బాగానే హోల్డ్ చేస్తుండడంతో లిమిటెడ్ రిలీజ్ దక్కింది.

అయితే తొలిరోజు ఈ చిత్రం డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేసింది. మొదటి రోజు ఈ చిత్రం 2.58 కోట్ల షేర్ ను సాధించింది. ఇక రెండో రోజు కూడా డిస్కో రాజా బాగానే హోల్డ్ చేసింది. శనివారం రోజు ఈ చిత్రం 1.65 కోట్ల షేర్ ను సాధించింది. రెండు రోజులకు కలుపుకుంటే డిస్కో రాజా షేర్ 4.23 కోట్లకు చేరుకుంది. ఈరోజు ఆదివారం కూడా ఈ చిత్రం డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ చిత్రానికి కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవని అంటున్నారు. ఏదేమైనా డిస్కో రాజా ప్రస్తుతానికి పర్వాలేదనిపిస్తోంది. మరి వీక్ డేస్ లో ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్న దానిపై చిత్ర విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

డిస్కో రాజా 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం : 1.8 కోట్లు
సీడెడ్ : 57.9 లక్షలు
గుంటూరు : 28.3 లక్షలు
ఉత్తరాంధ్ర : 51 లక్షలు
తూర్పు గోదావరి : 33.5 లక్షలు
పశ్చిమ గోదావరి : 25.6 లక్షలు
కృష్ణ : 30.4 లక్షలు
నెల్లూరు : 17.2 లక్షలు

2 డేస్ మొత్తం షేర్ : 4.23 కోట్లు