డిస్కో రాజా గురించి సెన్సార్ వాళ్ళు ఏమంటున్నారు?


Disco Raja censor review
Disco Raja censor review

మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసి చాలా కాలమే అయింది. రవితేజ నటించిన గత మూడు సినిమాలు కూడా దారుణమైన పరాభవాన్ని మిగిల్చాయి. మూడు డిజాస్టర్ల తర్వాత రవితేజ చేస్తున్న చిత్రం డిస్కో రాజా ఈ నెల 24న విడుదల కాబోతోంది. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని యూనిట్ సభ్యులు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. రవితేజ కెరీర్ లోనే తొలిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ ను అటెంప్ట్ చేస్తున్నాడు. ప్రోమోలు, పాటలు ఏవి చూసినా చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించడంలో సఫలమయ్యాయి.

రవితేజ ఇందులో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించబోతున్నట్లు వినికిడి. అలాగే ఈ చిత్రంలో పీరియాడిక్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సునీల్, సత్య లాంటి వాళ్ళ కామెడీ ఈ సినిమాకు బలం కానుందని తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు బాబీ సింహా ఈ సినిమాలో విలన్ గా నటించాడు. విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. రజినీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు.

ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా ముగించుకుంది. కట్స్ ఏం లేకుండా చిన్న చిన్న మ్యుట్స్ తో ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. సినిమా చూసిన సెన్సార్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రవితేజకు ఇది బెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని అంటున్నారు. జనవరి 24న విడుదల కానున్న ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా ఏం లేదు. సంక్రాంతి సినిమాల హడావిడి సద్దుమణగడంతో సినిమా బాగుంటే రవితేజకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురనేది ఉండదు.

మాస్ మహారాజా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న హిట్ ఈ చిత్రం ద్వారా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ కూడా ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.