గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న డిస్కో రాజా


Disco Raja
Disco Raja

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ డిస్కో రాజా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నెల 2న రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు గోవా వెళ్లిన డిస్కో రాజా టీమ్ సరిగ్గా రెండు వారాల్లో షెడ్యూల్ ను ముగించుకుంది.

నిన్నటితో గోవాలో తీయాల్సిన పార్ట్ పూర్తైనట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే డిస్కో రాజా షూటింగ్ పార్ట్ పూర్తైనట్లుగా తెలుస్తోంది.

ఈ నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తాన్యా హోప్ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.