డిస్కో రాజా వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్


Disco Raja first weekend world wide collections report
Disco Raja first weekend world wide collections report

మాస్ మహారాజా నటించిన డిస్కో రాజా తొలిరోజు నుండి డీసెంట్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. కొత్తరకమైన కథతో దర్శకుడు విఐ ఆనంద్ రవితేజను చూపించిన విధానానికి ఆయన ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. డిస్కో రాజ్ పాత్రలో రవితేజ పెర్ఫార్మన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. మొదటి రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో 4.23 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుకు 1.6 కోట్ల షేర్ ను సాధించడంతో టోటల్ 5.83 కోట్లకు చేరింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను కూడా కలుపుకుంటే ఈ చిత్రం దాదాపు 7 కోట్లకు చేరుకుంది. రోజురోజుకు ఈ చిత్ర కలెక్షన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నట్లు ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది.

22 కోట్లకు ఈ చిత్ర బిజినెస్ పూర్తయింది. ఈ నేపథ్యంలో వీక్ డేస్ లో కలెక్షన్స్ చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈరోజు నుండి డిస్కో రాజా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనే దానిపై చిత్ర విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ డీసెంట్ గా ఉంది.

డిస్కో రాజా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 2.52 కోట్లు
సీడెడ్ : 81 లక్షలు
గుంటూరు : 41 లక్షలు
ఉత్తరాంధ్ర : 74 లక్షలు
తూర్పు గోదావరి : 41 లక్షలు
పశ్చిమ గోదావరి : 33 లక్షలు
కృష్ణ : 40.5 లక్షలు
నెల్లూరు : 19 లక్షలు

ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ : 5.83 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా + ఓవర్సీస్ : 1 కోటి

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ : 6.83 కోట్లు

విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. బాబీ సింహా విలన్ గా కనిపించారు.