‘డిస్కోరాజా’ హంగామా మొద‌లైందిగా!


‘డిస్కోరాజా’ హంగామా మొద‌లైందిగా!
‘డిస్కోరాజా’ హంగామా మొద‌లైందిగా!

ఏడాది విరామం త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వస్తున్నచిత్రం `డిస్కోరాజా`. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`ఫేమ్ వి.ఐ. ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైంటిఫిక్ ఫిక్ష‌న్‌ రెట్రో థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. న‌భా న‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ట‌చ్ చేసి చూడు. నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని వంటి వ‌రుసగా హ్యాట్రిక్ ఫ్లాప్‌లు రావ‌డంతో `డిస్కోరాజా` విష‌యంలో మాస్ మహారాజా ర‌వితేజ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

టూ డైమెన్షన్స్ వున్న పాత్రలో రవితేజ ఇందులో క‌నిపించ‌బోతున్నారు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ణ‌ణ‌గా నిలుస్తాయ‌ని, ఇటీవ‌ల విడుద‌ల చేసిన ర‌వితేజ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌ల రెట్రో లుక్ ద్వారా తెలుస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇటీవ‌ల న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ర‌వితేజ్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. రిలీజ్ ద‌గ్గ‌ర‌పడుతుండ‌టంతో టీమ్ ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహించ‌బోతున్నారు. దీంతో `డిస్కోరాజా` ప్ర‌మోష‌న్ హంగామా మొద‌లుకాబోతోంది. గ‌తంలో ర‌వితేజ న‌టించిన `నేల టిక్కెట్టు` చిత్రాన్ని ఇదే నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే. `డిస్కోరాజా` ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ఈసారి ఎవ‌రు రాబోతున్నార‌న్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్‌గానే వుంచారు.