మాస్ మహారాజా చాలా బ్యాడ్ అంటున్నాడేDisco Raja teaser on the way
Disco Raja teaser on the way

మాస్ మహారాజా రవితేజ హిట్టు కొట్టి చాలా కాలమైంది. అతని రీసెంట్ సినిమాలు అన్నీ వరసగా ప్లాపులుగా మిగిలాయి. నిజానికి అతని లాస్ట్ మూడు సినిమాలు టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. కలెక్షన్స్ కూడా కిందస్థాయికి పడిపోవడంతో అసలు రవితేజ సినిమా అంటే ప్రేక్షకులకు డౌట్స్ వచ్చే పరిస్థితి నెలకొంది. లాస్ట్ ఐదు సినిమాల్లో ఒకటే హిట్ కొట్టాడంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ ఎంతో రిస్క్ చేసి చేస్తున్న సినిమా డిస్కో రాజా.

రవితేజ మీద గత కొన్ని సినిమాలుగా ఉన్న ప్రధాన కంప్లైంట్. అవి బాగా రొటీన్ గా ఉన్నాయని. అందుకే రవితేజ ఈసారి విభిన్న సినిమాలను తెరకెక్కించే విఐ ఆనంద్ తో డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. అంటే సైన్స్ ను, నమ్మకాలను ఈ సినిమాలో కలిపి చూపించబోతున్నారు. రివెంజ్ యాంగిల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టలేకపోతే తన కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే.

కానీ డిస్కో రాజా విభిన్న సినిమా అనే ఇంప్రెషన్ తన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ తోనే కలిగింది. పాట విడుదలై చాలా రోజులు గడిచినా మరో అప్డేట్ రాలేదు. అయితే రీసెంట్ గా టీమ్ నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ డిసెంబర్ 6న విడుదల కాబోతోందని టీమ్ అధికారికంగా ప్రకటించింది. టీజర్ అనౌన్స్మెంట్ తో పాటు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. డాడీ.. బ్యాడి ఆన్ ది వే అని అంటున్నారు. అంటే దీనర్ధం రవితేజ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేసాడనుకోవాలా?

హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ధరించడం కొత్తేమి కాదు. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు, ఆర్య 2 లో అల్లు అర్జున్, జెంటిల్ మ్యాన్ లో నాని, జై లవకుశలో ఎన్టీఆర్, ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ఇలా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ధరించారు. అయితే ఈ సినిమాలకు చాలా భిన్నంగా డిస్కో రాజా ఉండబోతోంది. టీజర్ లో కథ ఏంటనేది చూచాయిగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

నేల టికెట్, చుట్టాలబ్బాయి చిత్రాలను నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొదటి రెండు చిత్రాలు ప్లాపులు అయినా ఈ చిత్రంతో సక్సెస్ కొట్టాలని రామ్ ఆశాభావంతో ఉన్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్స్ గా నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే నువ్వు నాతో ఏమన్నావో అనే పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రాన్ని క్రిస్మస్ కు విడుదల చేద్దామనుకున్నా ఇప్పుడు జనవరి చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కావొచ్చు.