అప్పుడే మహర్షి రీమేక్ గురించి ఆలోచనలా ?


Mahesh and Vijay
Mahesh and Vijay

మహర్షి సినిమా రిలీజ్ కాలేదు , హిట్ కాలేదు కానీ అప్పుడే తమిళంలో రీమేక్ గురించి అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నటించడం గురించి చర్చ జరుగుతోంది . మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈనెల 9 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే రీమేక్ గురించి ఆలోచనలు చేస్తున్నారు .

తమిళంలో విజయ్ ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారట . మహర్షి తప్పకుండా హిట్ అవుతుంది అన్న ధీమా లో ఉన్నారు అందుకే ఈ చర్చ చేస్తున్నారు . అయితే సినిమా హిట్ అయితేనే ఈ ఆలోచనలు కలిసి వస్తాయి లేదంటే ఈ ఆలోచనలు చేసి ప్రయోజనం లేదు . మహర్షి చిత్రం పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఆ అంచనాలను అందుకుంటే కదా హిట్ అయ్యేది ! అప్పుడు రీమేక్ గురించి ఆలోచిస్తే బెటర్ ఏమో !