ప్రభాస్ రేంజ్ నిజంగా పెరిగిందా ?


Discussion on Prabhas range

300 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందిస్తున్న చిత్రం ” సాహో ” . సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రేక్షక లోకం ఎదురు చూస్తోంది ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది .

 

అయితే ప్రభాస్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే కానీ అది ఎంతవరకు అన్నది ఈ సాహో ని బట్టి తేలనుంది . మే నెలలో సాహో షూటింగ్ ని దాదాపుగా ముగించాలని చూస్తున్నారట . అయితే మూడు పాటలతో పాటుగా కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంటుందేమో అని అనుకుంటున్నారు. అయితే సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉండటంతో త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 15 న సాహో ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Discussion on Prabhas range